గుంటూరు జిల్లా లంకవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదం(fire accident)లో.. మృతి చెందిన ఒడిశా(odisha) కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించింది. కూలీల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్(cm jagan).. రొయ్యల చెరువు యజామాని నుంచి.. మృతుల కుటుంబాలకు తగిని పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఏం జరిగింది...
నిరుపేద కుటుంబాలకు చెందినవారు పొట్టకూటి కోసం ఒడిశా నుంచి గుంటూరు జిల్లాకు వలస వచ్చారు. ఊహించని విధంగా అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో నిద్రలోనే మృత్యుఒడికి చేరారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. మరో ఆరుగురు త్రుటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. రాయగఢ్ జిల్లాకు చెందినవారు ఇక్కడి బెయిలీ ఆక్వాఫాంలో మేత వేయటం, రసాయనాలు చల్లడం, మోటార్ల నిర్వహణ, కాపలా కాయటం వంటి పనులు చేస్తుంటారు. చెరువు పక్కనే ఉన్న షెడ్లలో వీరికి వసతి కల్పించారు.
పది మంది నిద్రిస్తున్న షెడ్డులో గురువారం రాత్రి 11.45కు పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. వేడికి గదిలో నిద్రిస్తున్న వారిలో నలుగురికి మెలకువ వచ్చి బయటకు పరుగుతీశారు. గది బయట మంచంపై నిద్రిస్తున్న సూపర్‌వైజర్లు జి.లింగారావు, పి.బాపిరెడ్డిలను నిద్రలేపారు. పొగ ధాటికి వారు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఈలోగా పక్క గదుల్లో ఉన్నవారు లేచి వచ్చి తీవ్రంగా శ్రమించి మంటలార్పారు.
కాస్త చల్లబడ్డాక చూస్తే లోపల ఆరుగురు గుర్తుపట్టలేని విధంగా బూడిదగా మారారు. ప్రమాద స్థలం భయానకంగా ఉండటం, మృతదేహాలను ముట్టుకుంటే రాలిపోయేలా కనిపించడంతో పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. అక్కడే పంచనామా నిర్వహించారు. మృతుల్లో ఒకరు మినహా అందరూ బాలకార్మికులేనని వారి స్వస్థలాలనుంచి అందిన సమాచారంబట్టి తెలుస్తోంది. ఇక్కడి అధికారులు మాత్రం ముగ్గురు 18ఏళ్ల వారని, ఇద్దరు 19, ఒకరు 23ఏళ్లవారని స్పష్టం చేస్తున్నారు. కుటుంబీకులు వచ్చాక మృతదేహాలను తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. మృతదేహాలు ఇప్పటికీ దుర్ఘటన స్థలం వద్దే ఉన్నాయి.
దోమల కాయిల్స్ వల్లే ప్రమాదమా?