జాబిలిపై అడుగుపెట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయినా.... యావత్ దేశమంతా ఇస్రో శాస్త్రవేత్తల పట్ల గర్వంగా ఉందని సీఎం జగన్ కొనియాడారు. మనం దాదాపుగా చంద్రునికి చేరువయ్యామని ఆఖరి క్షణాల్లో వచ్చిన చిన్న తడబాటు భవిష్యత్తులో సాధించబోయే విజయానికి మెట్టు లాంటిదన్నారు. ఈ పరిస్థితుల్లో దేశమంతా ఇస్రోకు అండగా నిలబడి ఉందన్నారు. వారి అద్భుతమైన కృషిని కొనియాడాల్సిందేనన్నారు.
దేశమంతా ఇస్రోకు అండగా ఉంది: సీఎం జగన్ - cm jagan on chandrayan -2 failure
దేశమంతా ఇస్రోకు అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. చిన్న తడబాటు భవిష్యత్తులో సాధించబోయే విజయానికి మెట్టులాంటిదని... చంద్రయాన్-2పై ట్విట్టర్లో స్పందించారు.
సీఎం జగన్