ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Not Pressing the Button విద్యార్థుల మెడ నుంచి కాలేజీ యాజమాన్యాలకు చుట్టుకుంటున్న మిస్సైన బటన్​లు.. ఎగ్గొడుతున్న దీవెనలతో అగచాట్లు!

CM Jagan Not Pressing the Button వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జగన్ సర్కార్ మోసగిస్తుంది. గత విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన మూడో విడత ఫీజును ఇప్పుడు చెల్లిస్తుంది. దీంతో త్రైమాసిక వారీగా ఇచ్చేస్తామంటూ జగన్ ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆ భారం విద్యార్థులపై పడుతోంది.

jagan_govt_cheated_students
jagan_govt_cheated_students

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 7:34 AM IST

Updated : Aug 28, 2023, 9:49 AM IST

CM Jagan Not Pressing the Buttonదేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తున్నామని కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయింది. కానీ ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించిన మూడో విడతను ఇప్పుడు విడుదల చేస్తుంది. సీఎం మాత్రం అన్నీ ఎప్పటికప్పుడే ఇచ్చేస్తున్నట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ.. మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక

YCP did not pay fees in four years of coming to power:వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాదీ సకాలంలో బోధన రుసుములు, వసతిదీవెన చెల్లించలేదు. గతేడాదికి సంబంధించిన నాలుగో విడత త్రైమాసిక ఫీజు ఇంకా బకాయి ఉంది. ఇక ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఫీజులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నది ఎంత అబద్ధమో చెప్పేందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఫీజులు చెల్లించలేదని ప్రభుత్వ విశ్వవిద్యాలయంలోనే విద్యార్థులకు పరీక్షలు పెట్టలేదు. వసతిదీవెన, విద్యాదీవెనఫీజులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి కట్టలేకపోయారు. దీంతో ఫీజులు చెల్లించలేదని పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు పెట్టలేదు. ముందుగా ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చాక తీసుకోవాలని వర్సిటీ మేనేజ్​మెంట్ ఒత్తిడి చేస్తోంది. ఒక ఏడాది చదువు పూర్తయినా ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజులు అడగకుండా కళాశాలలు ఉంటాయా ఉచితంగానే పాఠాలు చెబుతాయా సీఎం జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోవట్లేదు.

Vasathi Deevena: సీఎం వసతి దీవెన సభలో.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని

Colleges give Certificates only on Payment of Fees:మూడేళ్ల డిగ్రీ పూర్తయి చాలామంది కళాశాల నుంచి వెళ్లిపోయారు. యాజమాన్యాలు మాత్రం ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటున్నాయి. ప్రభుత్వం త్రైమాసికానికి 6 వందల 98 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు ముందుగా అప్పులు చేసి ఈ మొత్తాన్ని చెల్లించాల్సివస్తోంది. ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం రెండు, మూడు, నాలుగు సంవత్సరాల్లో ఉన్నవారి నుంచి గతేడాది ఫీజులను కళాశాలలు ఎప్పుడో వసూలు చేసేశాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ఈ ఏడాది ఫీజు కట్టాలంటున్నాయి. ప్రభుత్వం మాత్రం గతేడాది వాటినే ఇంకా సాగదీస్తోంది. డిగ్రీలో ప్రస్తుతం రెండు, మూడు సంవత్సరాల్లో ఉన్నవారికి మరో త్రైమాసికం ఫీజులు బకాయి పెట్టింది. ప్రభుత్వం ఇవ్వలేదంటే యాజమాన్యాలు ఊరుకుంటాయా డబ్బులిస్తేనే కళాశాలకు రావాలంటూ పిల్లల్ని ఒత్తిడి చేస్తున్నాయి.

Cm jagan tour: చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు.. సభ నుంచి వెళ్లిపోయిన ప్రజలు

Government did not pay Quarterly Fee:కరోనా సమయంలో కళాశాలలు నడవలేదంటూ 2020-21లో ప్రభుత్వం ఒక త్రైమాసిక ఫీజును ఎగ్గొట్టింది. యాజమాన్యాలు మాత్రం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లలో సిలబస్ పూర్తిచేసి పరీక్షలు పెట్టినందున మొత్తం ఫీజును వసూలు చేసుకున్నాయి.వసతి దీవెన ఒక విడతకు ఎగనామం పెట్టింది. హాస్టల్లో ఏడాది ఉండి చదువుకున్న తర్వాత ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను యాజమాన్యాలు హాస్టల్లో ఉంచుతాయా గత విద్యాసంవత్సరం పూర్తయినా వసతి దీవెన సగమే ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని తల్లిదండ్రులే చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే 20వేల రూపాయలు ఏ మూలకూ చాలవని తల్లిదండ్రులు అంటుంటే ప్రభుత్వం ఆ మొత్తాన్నీ సకాలంలో ఇవ్వడం లేదు.

PG teaching in private colleges:ప్రైవేటు కళాశాలల్లో పీజీ బోధన రుసుముల చెల్లింపును ప్రభుత్వం 2020-21 నుంచి నిలిపివేసింది. అప్పటివరకు ఉన్న బకాయిలను చెల్లించకుండా యాజమాన్యాలను బెదిరించి బకాయిల సెటిల్‌మెంట్ చేస్తోంది. బకాయిలు 75శాతం ఇస్తామని ఇంతే తీసుకోవాలని బెదిరించింది. వారి నుంచి బలవంతంగా సమ్మతి పత్రాలను తీసుకొంది. భవిష్యత్తులో దీనిపై కోర్టుకూ వెళ్లబోమనే హామీ పత్రాలు రాయించుకుంది. అయినా బకాయిలను ఇవ్వడం లేదు. పీజీ ఫీజులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో చాలా కళాశాలల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు ఉండిపోయాయి. కొంతమంది ఫీజులు చెల్లించి పత్రాలు తీసుకువెళ్లగా.. చాలామంది కళాశాలలోనే వదిలేశారు.

CM Jagan Not Pressing the Button విద్యార్థుల మెడ నుంచి కాలేజీ యాజమాన్యాలకు చుట్టుకుంటున్న మిస్సైన బటన్​లు.. ఎగ్గొడుతున్న దీవెనలతో అగచాట్లు!
Last Updated : Aug 28, 2023, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details