CM Jagan Neglect on Development of Urdu Language :ఉర్దూ భాషాభివృద్ధికి ఎవరూ చేయని కృషి తామే చేస్తున్నట్లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే గతేడాది నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని గుంటూరులో ఆర్భాటంగా నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ అవార్డులు ప్రదానం చేశారు. కొన్ని అవార్డులకు ఎంపికైన వారికి నేరుగా నగదును అందించారు. ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, మెరిట్ విద్యార్థులకు మాత్రం ఆ తర్వాత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పి పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది ఉత్తమ ఉపాధ్యా యుల్ని, దాదాపుగా అదే సంఖ్యలో విద్యా ర్థుల్ని ఎంపిక చేశారు. ఒక్కో ఉపాధ్యాయునికి 10 వేల రూపాయలు, ఒక్కో విద్యార్థికి 5 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించాలి. దాదాపు ఏడాదవుతున్నా ఆ మొత్తం ఇప్పటికీ జమ కాలేదు.
నవంబర్‌లో అవార్డుల ప్రదానం.. మేలో బిల్లు పెట్టడమా! :పని చేయకుండానే ప్రచారాన్ని పొందటంలో జగనన్నను మించినవారు మరొకరు ఉండరేమో. కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నా పిల్లల్ని ప్రోత్సహించేందుకు ఆ మాత్రం డబ్బులివ్వడానికీ జగన్ మామయ్యకు చేతులు రాలేదు. గతేడాది అవార్డుల డబ్బులే ఇవ్వని ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 11న అవార్డులు ప్రదానం చేసేందుకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఎంపిక కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పైగా ఇవేమీ ప్రజలకు తెలియదన్నట్టు.. నాలుగున్నరేళ్ల పాలనలో ముస్లింలను ఉద్దరించేసినట్టు సామాజిక సాధికారత యాత్ర కూడా చేపట్టగల ఘనాపాఠీ సీఎం జగన్.
Kurnool Urdu Univeristy: చంద్రబాబు ప్రారంభించారని జగన్ వదిలేేశారు..! ఉర్దూ వర్సిటీ భవిత అగమ్యగోచరం