ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా - వైఎస్సార్​సీపీ

CM Jagan Meeting with YSRCP Regional Coordinators: వైఎస్సార్​సీపీ ప్రాంతీయ పర్యవేక్షకులతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్‌ చర్చించారు.

cm_jagan_meeting
cm_jagan_meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 10:11 PM IST

Updated : Dec 27, 2023, 10:50 PM IST

CM Jagan Meeting with YSRCP Regional Coordinators: రాష్ట్రంలో రానున్న ఎన్నికల దృష్ట్యా వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అందుకు తగిన కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్​సీపీ అధినేత జగన్​మోహన్​ రెడ్డి బుధవారం ఆ పార్టీ ప్రాంతీయ పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల ఇన్​ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్​మోహన్​ రెడ్డి పలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్​ఛార్జులను ఖరారు చేశారు. మరికొన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్​ఛార్జ్​లను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్​సీపీ పార్లమెంట్​ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే 3 నెలల్లో పార్టీ చేపట్టే ప్రధాన కార్యక్రమాలపై సీఎం సమావేశంలో చర్చించారని అయోధ్యరామిరెడ్డి వివరించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో 3 కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు.

మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు

ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ముఖ్యమంత్రి జగన్​ చర్చించారన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పినట్లు ఆయోధ్యరామిరెడ్డి వెల్లడించారు. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులుగా భావించి పని చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

తమ ప్రభుత్వం అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపైనా చర్చించినట్లు వివరించారు.

వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్‌ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు

గెలుపోటములను దృష్టిలో ఉంచుకుని పార్టీ అభ్యర్థులను మార్చినట్లు సజ్జల తెలిపారు. వీలైనంత త్వరలో మారిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. అభ్యర్థులను మార్చిన చోట కొత్తవారి గెలుపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. పార్టీ నుంచి వ్యక్తులు వెళ్లినంత మాత్రాన ఇబ్బందేమీ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని, పార్టీకి ప్రజల్లో డిమాండు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకునే వారికి సర్ధి చెప్పుకుంటామని అన్నారు. అయినా వినని వారు వెళ్లి పోతారన్నారు. వీరు వెళితే ఇంకోకరు వస్తారని, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.

పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్ ఆలోచన విధానం ఒకేలా ఉందన్నారు. ఎవరైనా పార్టీ నుంచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళితే దాన్ని కూడా బ్రాడ్ మైండ్​తో చూస్తామని సజ్జల స్పష్టం చేశారు. అందరినీ సమన్వయం చేసేందుకే ఈ విధంగా మీటింగ్​లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సీట్ల మార్పుపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం

Last Updated : Dec 27, 2023, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details