CM Jagan Meeting with YCP Leaders:ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్ పిలుపుతో గత రెండు రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్నారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వెళ్లడంపై పార్టీ నేతలల్లో ఆందోళన మొదలైంది.
వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం!
సీఎం కార్యాలయానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ చర్చించనున్నారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్‌ఛార్జులను ఖరారు చేయనున్నారు. వీరితో పాటు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెండో రోజు కూడా సీఎం కార్యాలయానికి వచ్చారు. ప్రకాశం జిల్లా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్‌తో చర్చించనున్నారు.
'విశ్వసనీయత అంటే మాదీ నాదీ' అంటూనే నయవంచన- ఇదే జగ'నైజం'
MLAs Coming to CM Camp Office in Tadepalli:ఈ మధ్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ నియోజకవర్గ నాయకులను క్యాంపు కార్యాలయానికి పిలిచారు. గిద్దలూరు ఎంపీపీ భర్త వంశీధర్ రెడ్డి సీఎం కార్యాలయంలో పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తన సీటు విషయమై సీఎం జగన్‌తో బాలినేని చర్చించారు. బాలినేనితో పాటు విజయసాయిరెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత మాట్లాడిన బాలినేని తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరనేది శుక్రవారం తేలుతుందని అన్నారు. వీరితో పాటుగా మాజీ మంత్రి పేర్నినాని, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
సమన్వయకర్తల నియామకంతో వైఎస్సార్సీపీలో రగడ - రోజురోజుకీ ముదురుతున్న వర్గపోరు
Former Cricketer Ambati Rayudu Joined YCP:మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రాయుడును ఖరారు చేశారు. గత ఆరు నెలల నుంచి రాయుడు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయనకు లోక్‌సభ స్థానం కేటాయించనున్నట్లు చర్చ జరిగింది.