ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Meeting: గోదావరి జిల్లాల వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ.. - అమలాపురంలో మంత్రి విశ్వరూప్ x ఎంపీ చింతా అనురాధ

CM Jagan Meeting YSRCP Leaders: గోదావరి జిల్లాల్లో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీలో వర్గపోరుకు చెక్‌ పెట్టడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. గోదావరి జిల్లాలు రాబోయే ఎన్నికల్లో కీలకం కానున్నాయనే.. అంతర్గత నివేదికల మేరకు సీఎం ఈ కసరత్తు చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

CM_Jagan_Meeting
CM_Jagan_Meeting

By

Published : Aug 7, 2023, 10:27 AM IST

Updated : Aug 7, 2023, 10:33 AM IST

CM_Jagan_Meeting: గోదావరి జిల్లాల్లో ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలతో సీఎం కీలక భేటీ

CM Jagan Meeting With Godavari YSRCP Leaders: ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇంకోవైపు పార్టీలో కుమ్ములాటలు.. వీటికి మించి వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చూపిన ప్రభావం.. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో జరిగే ఈ సమావేశంలో పార్టీలో వర్గపోరుకు చెక్‌ పెట్టడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

గోదావరి జిల్లాల్లో ప్రధానంగా తెలుగుదేశం, జనసేన ప్రభావం ఎలా ఉండనుందనే అంశాలపై తనకు వచ్చిన సమాచారాన్ని పార్టీ నేతలతో చర్చించే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలు కీలకం కానున్నాయనే అంతర్గత నివేదికల మేరకు సీఎం ఈ కసరత్తు చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాన్ని.. సీఎం సూత్రప్రాయంగా పార్టీ నేతలకు వివరిస్తారని అంటున్నారు.

బీసీ మంత్రులతో సీఎం జగన్ సమావేశం

CM Jagan Meeting: మల్లాడి కృష్ణారావు X ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి: బీసీ నాయకుడు, పుదుచ్చేరి మాజీ మంత్రి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లాడి కృష్ణారావు.. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మధ్య విభేదాలపై సీఎం చర్చించే అవకాశముంది. మల్లాడి కృష్ణారావు కాకినాడ, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజికవర్గానికి నేతగా ముద్ర ఉంది. గత జూన్‌లో మల్లాడి జన్మదినం సందర్భంగా కాకినాడలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలతోనే తొలగించారని కృష్ణారావు వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు.

జూన్‌లో బీసీ సంఘాలతో మల్లాడి కాకినాడలో సమావేశం తలపెట్టగా.. వైసీపీలోని ఆయన సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లు, నేతలు వెళ్లలేదు. అదే రోజు ఎమ్మెల్యే వర్గం బీసీ ర్యాలీకి సిద్ధమైంది. ఇరువర్గాలు తగ్గకపోవడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మల్లాడి సభను, ఎమ్మెల్యే వర్గం ర్యాలీని విరమించుకున్నాయి. తాజాగా కృష్ణారావు బీసీ ప్రతినిధుల సభను పెట్టారు. దీనికి పోటీగా త్వరలో ఎమ్మెల్యే వర్గం మరో సభకు సిద్ధమవుతోంది.

అమరావతి రైతుల కోసం మరో నగరం : కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలు

CM Jagan Meeting:రామంచంద్రపురం వైసీపీలో మూడు వర్గాలు: రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణతో అమీతుమీకి ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోతే ఎంపీ పదవిని వదులుకుని స్వతంత్రంగా బరిలో దిగుతానని ఆయన చెప్పారు. సీఎంను కలిసి మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలోనే మూడో వర్గం నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. ఇటీవల సీఎం కార్యాలయానికి వచ్చి రామచంద్రపురంలో పరిస్థితులను వివరించారు. సీఎం జిల్లాకు వస్తారని, అక్కడే కలవాలని ఆయనకు అధికారులు చెప్పి పంపారు. ఈ ముగ్గురితో చర్చించి రామచంద్రపురం సమస్యకు సీఎం పరిష్కారం చూపుతారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

CM Jagan Meeting :ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పోటి: అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ.. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం.. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మధ్య వర్గపోరు కొనసాగుతోంది. జగ్గంపేట టికెట్‌ రేసులో ఉన్న తోట నరసింహం నియోజకవర్గంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యేతో ఇద్దరు ఎంపీపీలు, ఒక జెడ్పీటీసీ సభ్యురాలు విభేదించారు. ఏలేశ్వరంలో కొందరు కౌన్సిలర్లు ఏకంగా రాజీనామా చేశారు. వీటన్నింటిపై సీఎం వద్ద పంచాయితీ జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

CM MEETING: మరింత బాధ్యతగా పని చేయాలి: జగన్​

Last Updated : Aug 7, 2023, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details