CM Jagan Laid Foundation Stone for 13 Food Processing Units: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) హామీ ఇచ్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా ఫోన్ కాల్ చేసినా పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. ఆహారశుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 ప్రాజెక్టులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా భూమిపూజ, శంకుస్ధాపన చేశారు. వీటిలో 3 కంపెనీల ప్రారంభోత్సవం చేయగా, 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Nara Brahmani Tweet On AP Industries : ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయి.. వైసీపీ ప్రభుత్వ ఎజెండా ఏమిటి? : బ్రాహ్మణి
ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నారు. వీటి ద్వారా రాష్ట్రానికి 3 వేల 58 కోట్ల పెట్టుబడులు సహా 6755 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. 14 జిల్లాల్లో వచ్చే అన్ని పరిశ్రమల వల్ల సుమారు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఇప్పటికే చట్టం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు క్రమంగా కార్యరూపం దాల్చుతున్నాయని సీఎం తెలిపారు.
Food Processing Industries Towards Closure: 'అన్నీ ఉన్నా సహకారం సున్నా'.. జగన్ పాలనలో మూసివేత దిశగా ఆహారశుద్ధి పరిశ్రమలు
Substrate Manufacturing CEO Manpreet Khaira met CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను యూఎస్‌ఏకు చెందిన సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా కలిశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏర్పాటుకు ముందుకొచ్చిన సబ్‌స్ట్రేట్ ప్రతినిధులు, వీటిపై సీఎంతో ప్రాధమిక చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సబ్‌స్ట్రేట్ క్యాపిటల్ పార్ట్‌నర్ సిడ్నీ న్యూటన్, సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెరెక్టర్ మన్‌దీప్ ఖైరా పాల్గొన్నారు.
Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ షాక్.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు..
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం చాలా స్పూర్తిదాయకంగా జరిగిందని సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా అన్నారు. విశాఖలో ఏఐ ఆధారిత హౌసింగ్, ఏఐ ఆధారిత తయారీ పరిశ్రమలకు సంబంధించి తమ ప్రతిపాదనలకు, ఆలోచనలకు పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారని చెప్పారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, విశాఖలో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్ధానిక యువతలో ప్రతిభను పెంపొందించేదించుకు అవసరమైన అన్ని చర్యలపైనా సమావేశంలో చర్చించామన్నారు.
CM Jagan Laid Foundation Stone for Food Processing Units: పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.