Jagananna Smart Township: లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి వారికి మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇళ్ల స్థలాలు అందించే 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లే అవుట్లను..తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే ఎంఐజీ వెబ్ సైట్‌ను ఆయన ఆవిష్కరించారు.
ప్రతీ నియోజకవర్గానికి విస్తరిస్తాం
Jagananna smart town ship launched by Cm Jagan: ఎంఐజీ(MIG)ల్లో మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ ఉంటుందని సీఎం తెలిపారు. 150, 200, 240 చదరపు గజాల స్థలాలు ఎంచుకునే అవకాశం లబ్దిదారులకు కల్పిస్తున్నట్లు చెప్పారు. లిటిగేషన్ లేకుండా అభివృద్ధి చేసిన ప్లాట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంఐజీలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో కేటాయిస్తామన్నారు. ఈ పథకాన్నిరాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి విస్తరిస్తామని ప్రకటించారు.