ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan: మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు: అమరావతి రైతులు - CM Jagan is destroying the state

YSRCP on three capitals: అమరావతి రైతుల మహా పాదయాత్రలో పోలీసుల చర్యలకు నిరసనగా హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రైతాంగ పోరాట వేదిక సదస్సు నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతికి అంగీకారం తెలిపి అధికారంలోకి వచ్చిన అనంతరం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అమరావతి రైతులు ధ్వజమెత్తారు.

YSRCP of three capitals
అమరావతి రైతులు

By

Published : Oct 24, 2022, 8:13 AM IST

మాట్లాడుతున్న అమరావతి రైతులు

Three capitals in AP: నాడు ప్రతి పక్ష నేతగా అమరావతి రాజధానికి అంగీకరించిన ప్రస్తుత సీఎం జగన్‌.. ప్రస్తుతం మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని, అమరావతి రైతులు అన్నారు. అమరావతి రైతుల పోరాటంపై పోలీసుల నిర్బంధాలు, ప్రజాప్రతినిధుల దమనకాండ, దుష్ప్రచారానికి వ్యతిరేకంగా..హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతాంగ పోరాట వేదిక సదస్సు నిర్వహించింది.

అమరావతే రాజధాని అని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకపోవడంతోనే తాము మహా పాదయాత్ర చేపట్టామని తెలిపారు. అందుకూ నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. నోరు తెరిస్తే అక్కా చెల్లెమ్మలు అని మాట్లాడే సీఎం జగన్‌.. అమరావతి పోరాటంలో 2వేలకు పైగా మహిళలపై కేసులు పెట్టారన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న రైతులు, అమరావతిని సాధించే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details