జగనన్న గోరుముద్ద పథకానికి ఆహారం అందించేందుకు ఇస్కాన్ ఆక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ ఏర్పాటు చేసింది. కేవలం రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా దీన్ని నిర్మించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వంటశాలను ఇవాళ ప్రారంభించారు. విద్యార్ధులకు స్వయంగా భోజనం వడ్డించారు. తాను కూడా వంటకాలు రుచి చూశారు. కేంద్రీకృత వంటశాలను పరిశీలించి దాని ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేస్తున్న విధానాన్ని అక్షయ పాత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.