CATTLE AMBULENCES IN AP: రాష్ట్రంలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ పథకం కింద 111.62 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన 165 పశు అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి.. పనితీరు, సేవలను సీఎం జగన్ స్వయంగా పరిశీలించారు. మొదటి దశలో 129.07 కోట్ల వ్యయంతో ప్రారంభించిన 175 పశు అంబులెన్స్‌లు రాష్ట్రంలో తిరుగుతున్నాయి.
పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్ - second phase of cattle ambulances
CATTLE AMBULENCES IN AP : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ పథకంలో భాగంగా.. పశువుల అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ప్రారంభించారు. 111.62 కోట్ల వ్యయంతో బుధవారం మరో 165 పశు అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

Etv Bharat