స్పష్టమైన భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులు unseasonal rains in AP: నా నడక నేలమీదే... నా ప్రయాణం పేదలతోనే...! ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కొట్టిన డైలాగ్ ఇది. కానీ ఆయన మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప కూడా దాటడం లేదు. అకాల వర్షాలు లక్షల ఎకరాల్ని నాశనం చేసి వారందాటినా
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన భరోసా ఇచ్చారట. ఐతే, మన సీఎం భరోసా మాటల్లో తప్ప చేతల్లే కనిపించడం లేదు. పొరుగునున్న తెలంగాణ విషయానికే వద్దాం. రెండు రాష్ట్రాల్లో.. ఒకేసారి అకాల వర్షాలు కురిశాయి. పంటలను దెబ్బతీశాయి. నష్టం ఒకేలా ఉంది. కాకపోతే బాధిత రైతులను ఆదుకోవడంలోనే వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఉన్నతస్థాయి బృందంతో.... బస్సులో పొలాల్లోకి వెళ్లారు. 4జిల్లాల్లో... పంట నష్టాన్ని పరిశీలించారు. దెబ‌్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అధైర్యపడొద్దు ఆదుకుంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. కేంద్రంతో పనిలేకుండా తెలంగాణ ప్రభుత్వమే ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇస్తుందని, ప్రకటించారు. తొలిసారిగా కౌలు రైతుకు కూడా సాయం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఉత్తర్వులూ విడుదలయ్యాయి.
మరి అకాల వర్షాలు వచ్చిన తర్వాత మన సీఎం ఎక్కడికీ వెళ్లలేదా అంటే... వెళ్లకేం వెళ్లారు. ఆయనా రెండు జిల్లాల్లో పర్యటించారు. కాకపోతే బటన్ నొక్కి వచ్చేశారు. ఈనె 19న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యాదీవెన నిధుల విడుదలకు కార్యక్రమంలో పాల్గొన్నారు. 25న ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమానికి వెళ్లొచ్చారు. కాకపోతే.. ఈ రెండూ బటన్ నొక్కే కార్యక్రమాలే. ఆఫీస్‌లో కూర్చొనైనా బటన్ నొక్కొచ్చు. కానీ హెలికాప్టర్‌లో వెళ్లి మరీ బటన్లు నొక్కి వచ్చిన జగన్...... వడగళ్ల వానలతో సర్వం కోల్పోయిన రైతుల్ని మాత్రం పలకరించలేదు. సీఎం జగన్ సభలు నిర్వహించిన తిరువూరు,దెందులూరులోనూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అక్కడి వరకూ వెళ్లిన జగన్ పొలంగట్టు తొక్కలేకపోయారు. అంతటి కీలకమైన.... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా తీరిక చేసుకుని దిల్లీ వెళ్లొచ్చిన జగన్‌కు కన్నీటి కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శించే తీరిక లేకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.
వడగళ్ల వానలతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 22 జిల్లాల్లో లక్షల మంది రైతులు భారీగా నష్టపోయినా ... ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికీ అంచనాలు పూర్తిచేయలేదు. తెలంగాణలో వడగళ్ల వానలతో 2 లక్షల 28 వేల ఎకరాల్లో.. పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. కానీ మన వ్యవసాయశాఖ మాత్రం పంట నష్టంపై ముఖ్యమంత్రి సమీక్షించారని,.... త్వరితగతిన పంట నష్టం అంచనాలు వేయాలని ఆదేశించారంటూ... ఓ ప్రకటన మాత్రం విడుదల చేసింది. ప్రకృతి విపత్తులు స్పందించినప్పుడు ప్రభుత్వాలు మానవత్వంతో ఆదుకోవాలి. బాధిత రైతులపై ఉదారత చూపాలి. కానీ.. అధికారులు రకరకాల నిబంధనలతోపాటు 33% పంట నష్టం ఉండాలంటూ నమోదుకుకొర్రీలేస్తున్నారు.
విపత్తు నష్టాలకు 2014లో కేంద్రం నిర్ణయించిన సాయం చాలా తక్కువగా ఉండేది. హుద్‌హుద్ సమయంలో తెదేపా ప్రభుత్వం పెట్టుబడి రాయితీని ఎకరాకు . రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. తిత్లీ తుపాను వేళ మరింత పెంచింది. తిత్లీ తుపాన్ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం. వరికి ఎకరాకురూ.8వేల చొప్పున పరిహరం ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం అందులో.. 2వేలుతగ్గించి 6 వేలే ఇస్తోంది. అప్పటి ప్రభుత్వం అరటికి ఎకరాకు 12 వేలు ఇవ్వగాఇప్పుడు రూ.10 వేలే ఇస్తున్నారు. కొన్నేళ్లుగా సాగు వ్యయం భారీగా పెరిగినా...... పెట్టుబడి రాయితీని మాత్రం..పెంచలేదు. తొమ్మిదేళ్ల క్రితం నాటి పెట్టుబడి సాయాన్నే.. ఇప్పటికీ అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇటీవల...వర్షానికి దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకూ సాయం అందిస్తామని ప్రకటించింది. ఇదీ రైతుల్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా.
33% పంట నష్టం ఉంటేనే పరిహారం జాబితాలో, నమోదు చేయాలనే నిబంధన రైతులకు శాపంలా... మారింది. మామిడి, నిమ్మ తదితర పంటలు కాపు రాలిపోయినా పరిగణనలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ధాన్యం దిగుబడి ఎకరాకు 11 బస్తాలకన్నా తగ్గితేనే పరిగణించాలంటున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వానకు.... వరి, మొక్కజొన్న, మినుము, సెనగ, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వు, పొగాకుతోపాటు. అరటి, బొప్పాయి, మామిడి, బత్తాయి, నిమ్మ, మిరప, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. సుమారు... 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా... దాదాపు 2 వేల కోట్ల విలువైన పంటలు వర్షార్పణమైనట్లు భావిస్తున్నారు. ఇంతవరకూ పొలం బాటే పట్టని ప్రభుత్వాధినేతలకు జరిగిన పంట నష్టం ఏం తెలుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: