ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Guntur Tour Schedule: రేపు ప్రత్తిపాడులో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ విడుదల

CM Jagan Guntur Tour Schedule: రేపు గంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పింఛన్ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​ వివరాలను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది.

రేపు ప్రత్తిపాడులో సీఎం జగన్ పర్యటన
రేపు ప్రత్తిపాడులో సీఎం జగన్ పర్యటన

By

Published : Dec 31, 2021, 1:49 PM IST

CM Jagan Guntur Tour Schedule: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనవరి 1న ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​ను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. పెంచిన పింఛన్ పథకాన్ని సీఎం జగన్ ప్రత్తిపాడులో ప్రారంభించనున్నారు. సీఎం కార్యాలయం నుంచి జగన్ 10.30 గంటలకు బయల్దేరి హెలికాప్టర్ ద్వారా 10.55 గంటలకు ప్రత్తిపాడు చేరుకోనున్నారు. 11.11 గంటలకు ప్రత్తిపాడు ఎంపీడీవో కార్యాలయం సందర్శించిన అనంతరం 11.15 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం పెంచిన పింఛన్ నగదును అందజేసి సభలో ప్రసంగించనున్నారు. సభ ముగిసన తర్వాతా 12.55 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకోనున్నారు.

సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఐపీ, ప్రజలు కూర్చునే గ్యాలరీలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేందుకు రహదారిని నిర్మించారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదికకు వచ్చే ప్రధాన రహదారి అంతా బారికేడ్లను ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్​తో ముందుగా ట్రైల్​రన్ నిర్వహించారు.

61.75 లక్షల మందికి లబ్ధి..

వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద జనవరి నుంచి సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2500 పంపిణీ చేయనున్నారు. పెన్షన్​ను రూ.2,250 నుంచి రూ. 2,500లకు పెంచుతూ.. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ జరుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,570.60 కోట్లు విడుదల చేసింది. రేపు ప్రత్తిపాడులో సీఎం జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి: Peddireddy On Pensions: జనవరి నుంచి రూ.2,500 పంపిణీ: మంత్రి పెద్దిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details