CM Jagan Foundation Stone for 3 Renewable Energy Projects: రాష్ట్రంలో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లా యాగంటిలో వెయ్యి మెగా వాట్లు, అనంతపురం జిల్లా కమలపాడులో 950 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే నంద్యాల జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో ఎనర్జీ 2వేల 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఏపీజెన్కో, ఎన్‌హెచ్‌పీసీ సంయుక్తంగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. రెండు పీఎస్సీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.
MOU for Pumped Storage Projects: ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(Pumped Storage Projects) వల్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటం తగ్గుతుందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని స్పష్టం చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ కోసం 2రూపాయల 49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPC (National Hydroelectric Power Corporation) తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.
CM Jagan: 'నేతన్న నేస్తం' నిధులు విడుదల చేసిన సీఎం.. 'సేవకులపైనే విమర్శలా..?'