ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమెరికా కాన్సులేట్​కి జగన్... వీసా పనులు పూర్తి - అమెరికా కాన్సులేట్​కి జగన్

వీసా నిమిత్తం ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్​కి వెళ్లారు. వీసా పనులు పూర్తి చేసుకున్నారు.

అమెరికా కాన్సులేట్​కి జగన్

By

Published : Jul 31, 2019, 5:00 PM IST

అమెరికా కాన్సులేట్​కి జగన్

విదేశాలకు వెళ్లేందుకు... వీసా నిమిత్తం ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్​కి వెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్వగృహం నుంచి బయలుదేరిన సీఎం జగన్... రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న జగన్... అక్కడ నుంచి అమెరికన్ కాన్సులేట్​కు చేరుకొని వీసా పనులు పూర్తి చేసుకున్నారు. సీఎం జగన్ రేపు జెరూసలెం వెళతారు. అక్కడి పర్యటన అనంతరం... అమరావతి వచ్చి మళ్లీ 16న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17న అమెరికాలోని డెట్రాయిట్‌లో జరగనున్న ప్రవాసాంధ్రుల సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details