CM Jagan focus on Nellore ycp issue: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై.. సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఆర్ఎస్ ఆంజనేయులు, పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ సీఎం భేటీ అయ్యారు. నెల్లూరు రూరల్‌కు మరొకర్ని వైకాపా ఇన్‌చార్జ్‌గా నియమించాలని నిర్ణయించారు.
ఆనం, కోటంరెడ్డి ఆరోపణలను తిప్పికొట్టాలి.. నేతలకు సీఎం సూచన - undefined
15:18 February 01
నెల్లూరు గ్రామీణ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించాలని నిర్ణయం
వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై సజ్జల, ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుతో సీఎం చర్చించారు. సమావేశానికి హోం శాఖ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ప్రధానంగా ఇద్దరు నేతల వ్యవహార శైలిపై, తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్ల తెలిసింది. ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం ఉందని, అనేక ఆధారాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన దృష్ట్యా వీటిపైనా చర్చించినట్లు సమాచారం.
'ఆనం, కోటంరెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఐబీ చీఫ్ ఎమ్మెల్యేకు ఎందుకు చెబుతారు. కోటంరెడ్డి పరుషంగా మాట్లాడినవి ఎవరో రికార్డు చేసి ఉండొచ్చు. ఆరోపణలు వస్తే జాగ్రత్తగా ఉండాలని ఐబీ చీఫ్ చెప్పారేమో... ఎవరో ఫోన్ మాట్లాడింది ఆడియో రికార్డు చేస్తే ట్యాపింగ్ అంటున్నారు. అడ్డదారుల్లో వెళ్లడం సీఎం జగన్‌కు తెలియదు. వచ్చే ఎన్నికల్లోవెరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని పార్టీ చూసుకుంటుంది'.- సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు
నెల్లూరు జిల్లా వ్యవహారాలు చూస్తోన్న పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎంతో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స, మాజీ మంత్రులు పేర్నినాని తదితరులను పిలిపించుకుని మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయమై నేతలతో సీఎం సమాలోచనలు చేశారు. వైకాపా సహా ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి చేసిన పలు తీవ్ర ఆరోపణలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని నేతలకు సీఎం సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై సీఎంతో బాలినేని చర్చించారు. నెల్లూరు రూరల్‌కు వైకాపా ఇన్చార్జ్ పదవి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ని ప్రకటిస్తామని సమావేశం అనంతరం మాజీ మంత్రి బాలినేని తెలిపారు.
ఇవీ చదవండి: