తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రథం దగ్ధం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రథం దగ్ధంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ముఖ్యమంత్రి జగన్ గురువారం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కోరుతూ... హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవో వెలువరించే అవకాశం ఉంది.
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం - అంతర్వేది రథం ఘటన
19:41 September 10
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
గత శనివారం అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైంది. సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని సుమారు 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం దగ్ధమవడంపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు సహా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
ఇదీ చదవండి: