CM Jagan congratulates Telangana CM Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి సీఎం జగన్తో పాటుగా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలంటూ సూచనలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలని కోరుకుంటున్నాని సీఎం జగన్ వెల్లడించగా, ప్రజలకు సేవ చేసేందుకు రేవంత్ రెడ్డి భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రేవంత్‌రెడ్డి, ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని సీఎం అయ్యారని పవన్ తెలపగా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.
సీఎం వైఎస్ జగన్: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలని కోరుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహకారం కొనసాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం, మంత్రులకు శుభాభినందనలు తెలిపారు.
సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం
నారా చంద్రబాబు:తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే ఆయన భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా సాగాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పేర్కొన్నారు.
నారా లోకేశ్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించాలని లోకేశ్ ఆకాంక్షించారు.