ఉగ్రవాదులపై పోరులో ప్రాణాలొదిన అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ రూ.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రాణత్యాగం చేసిన జవాన్ చిరస్మరణీయుడు అంటూ ఘన నివాళి అర్పించారు. జశ్వంత్‌రెడ్డి దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారన్న జగన్... ఆయన త్యాగం నిరూపమైనదన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారని సీఎం జగన్ కొనియాడారు. కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని, ప్రభుత్వం తన వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.
CM ON JAWAN: అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి - jawan-jashwanth-reddy-death
అమర జవాను జశ్వంత్‌రెడ్డికి.. ముఖ్యమంత్రి జగన్(cm jagan) నివాళులర్పించారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. అమర సైనికుడు జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
![CM ON JAWAN: అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12403997-926-12403997-1625820765543.jpg)
అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి
Last Updated : Jul 9, 2021, 3:09 PM IST