CM Jagan Blocking Construction of Forensic Laboratory in Amaravati: కేంద్రం నిధులు ఇస్తానన్నా.. ఫోరెన్సిక్ ప్రయోగశాలను పట్టించుకోని జగన్ CM Jagan Blocking Construction of Forensic Laboratory in Amaravati : శాస్త్రీయమైన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్తులను గుర్తించటానికి అవసరమైన ఆధారాలు సేకరించటంలో, దర్యాప్తులో కీలకమైన అంశాలు పసిగట్టడంలో ఫోరెన్సిక్ ప్రయోగశాల కీలకం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో అలాంటి ప్రయోగశాల ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ రిసోర్సెస్ బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Central Government Will Give Funds to Forensic Laboratory :పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏపీకి మంజూరు చేసింది. దీనికి కేంద్రం 350 కోట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పరిధిలోని తుళ్లూరులో ల్యాబ్ కోసం భూమి కేటాయించింది. 2017 డిసెంబర్ 28న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమిపూజ చేశారు. కేవలం రాష్ట్రస్థాయి నేరాలకు సంబంధించే కాకుండా దేశంలో ఎలాంటి కేసుకు సంబంధించైనా ఆధారాలు విశ్లేషించేలా దీనికి రూపకల్పన చేశారు.
NIMZ Project Completely Sidelined by CM Jagan: నిమ్జ్ ప్రాజెక్టుపై జగన్ నిర్లక్ష్యం.. పారిశ్రామిక ఉపాధి, అవకాశాలపై పెద్ద దెబ్బ
దేశంలోనే ఈ తరహా సంస్థ తొలిసారిగా అమరావతిలో ఏర్పాటవుతోందని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. రాజధానిలో అంతటి ప్రతిష్ఠాత్మకమైన ల్యాబ్ ఏర్పాటైతే రాష్ట్రంలో పోలీసుశాఖతో పాటు సీఐడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు ఎంతగానో ఉపయోగపడేది. తెలుగుదేశం హయాంలో భవన నిర్మాణాలు కొంత మేర సాగాయి.
CM Jagan Neglect the Forensic Laboratory Construction :వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత కొద్ది రోజులు పనులు జరిగాయి. మూడు రాజధానుల ప్రకటన తర్వాత పనులు ఆపేశారు. పనులు సగంలో ఆగిపోవటంతో అక్కడ నిర్మాణ సామగ్రి కూడా దొంగలపాలవుతోంది. అమరావతిపై కక్షతోనే ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి అభివృద్ధిని, ప్రతిష్టాత్మక సంస్థల్ని అడ్డుకుంటున్నారని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు.
నేర నిరూపణలో శాస్త్రీయ ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ ప్రయోగశాల అత్యవసరం. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలకూ ఉపయోగపడేలా తెలుగుదేశం హయాంలో అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం ప్రారంభించారు. 'ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ నమూనాలో.. నేర నియంత్రణకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని తలపెట్టారు.
Jagan Ignores the Forensic Lab : డీఎన్ఏ, సైబర్, నార్కోటిక్స్, బయోమెట్రిక్స్, బాలిస్టిక్స్, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించి ఆరు ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, శిక్షణ, పరిశోధన, అభివృద్ధి విభాగాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఫోరెన్సిక్ డాక్యుమెంట్స్, టాక్సికాలజీ వంటి పలు ప్రయోగాలకూ అనువుగా రూపొందించాలని భావించారు. నిధుల లభ్యత ఉన్నా.. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగశాల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టడానికి రాజధానిగా అమరావతిపై కక్షే కారణమని రైతులు వాపోతున్నారు.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు
రాష్ట్రంలో ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఏర్పాటు, అభివృద్ధికి కేంద్రం 2017–19 ఆర్థిక సంవత్సరాల్లో 42.35 కోట్లు విడుదల చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు జతచేసి పనులు చేపట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేంద్రం నిధుల్లో 14.36 కోట్లకు 2020 నవంబరు నుంచి వినియోగపత్రాలు సమర్పించలేదు.
ఏపీలో ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఉన్నతీకరణ, ఏర్పాటుకు సాయం ఉప పథకం కింద 109.65 కోట్లు ఇవ్వడానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. పనులు వేగవంతం చేయాలని తాము ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నా ఫలితం లేదని కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 7న పార్లమెంట్లో వెల్లడించింది. ఫలితంగా నిధుల విడుదల నిలిచిపోయింది. ఈ ప్రయోగశాలను అమరావతి నుంచి మరో చోటకు తరలించాలన్న యోచనతోనే జగన్ ప్రభుత్వం కేంద్రం సూచనలనూ పెడచెవిన పెడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Government No Steps on Kadapa Steel Plant: సీఎం గారూ.. రెండు సార్లు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్‌ని ఎలా మరిచారు..?