CM JAGAN BIRTHDAY CELEBRATIONS : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు జగన్‌కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాలను తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు సీఎంకు అందించారు. పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్ జాన్ వెస్లీ.. ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. తర్వాత సీఎం జగన్ కేక్ కట్ చేశారు.
జగన్ బర్త్‌డే సందర్భంగా పలు చోట్ల రక్తదాన శిబిరాలు: సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను వైకాపా నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త దానం చేశారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లిలో మంత్రి గిడివాడ అమర్నాథ్ రక్తదానం చేశారు. శ్రీకాకుళం మంత్రి ధర్మాన జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేక్ కట్‌చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే జగన్మోహన్రావు ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.