గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ స్టేడియంలో గోపూజ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇస్కాన్ సహకారంతో 108 గోవులకు కామధేను పూజ చేశారు. తితిదే, దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మెుదటగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. అనంతరం గోమాతకు సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. ఆ తరువాత ప్రజలందరికీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
నరసరావుపేటలో గోపూజ మహోత్సవం.. పాల్గొన్న సీఎం జగన్ - cm jagan gopuja latest news
గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. గోమాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

cm jagan
నరసరావుపేట గోపూజలో పాల్గొన్న సీఎం జగన్
Last Updated : Jan 15, 2021, 4:20 PM IST