CM Jagan at National Minorities Welfare Day Program: విజయవాడలో జాతీయ మైనారిటీ దినోత్సవ కార్యక్రమం - మౌలానా ఆజాద్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు CM Jagan at National Minorities Welfare Day Program: జాతీయ మైనారిటీ, జాతీయ విద్యా దినోత్సవం (National Education Day) కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. జాతీయ మైనారిటీ దినోత్సవం పురస్కరించుకుని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి సీఎం పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఇతర మైనారిటీ నేతలు హాజరయ్యారు.
భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు స్థాపించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని (Maulana Abul Kalam Azad Birth Anniversary) పురస్కరించుకుని జాతీయ మైనారిటీ దినోత్సవంగా (National Minorities Welfare Day) నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారి మైనారిటీలకు అదనపు రిజర్వేషన్లు అమలు చేసింది వైఎస్ హయాంలోనేనన్నారు. తమ ప్రభుత్వం రెండడుగులు ముందుకు వేసి రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య అంశాల్లో మైనారిటీలకు పెద్ద పీట వేశామన్నారు.
ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్
గతంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని ప్రభుత్వం ఉందన్న సీఎం.. ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా చేసిన ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీ నుంచి నలుగురు మైనారిటీలు ఎమ్మేల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చేశామన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షురాలు పదవిలోనూ ముస్లింలను కూర్చోబెట్టామన్నారు. నామినేటెడ్ పదవులను ముస్లింలకు ఇచ్చామని తెలిపారు. చట్టం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు.. అందులోనూ మహిళకు 50 శాతం వచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
జగన్‌కు అటూ ఇటూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కనపడతారని అన్నారు. 53 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా సంక్షేమ పథకాలు అందించామని సీఎం తెలిపారు. గతంలోనూ.. ఇప్పుడు అదే ప్రభుత్వం, అదే బడ్జెట్ ఉన్నా.. మారింది కేవలం సీఎం మాత్రమేనన్నారు. ఇప్పటికీ 2.40 లక్షల కోట్లు డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా లబ్దిదారుల ఖాతాలకు వేశామని తెలిపారు. మైనారిటీలకు ఈ నాలుగేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు 23 వేల 176 కోట్లు ఇచ్చామన్నారు.
"మైనార్టీ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు"
షాది తోఫాకు (Shaadi Tohfa) పదో తరగతి నిబంధన తీసేయమన్నారని.. ఎన్నికల కోసం ఆలోచించమని సలహాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి.. కానీ యువతీ, యువకులు 10వ తరగతి చదవుకుంటే జీవితాలూ మారతాయని భావించి తాను అంగీకరించలేదని తెలిపారు. మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు, హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులను విజయవాడ నుంచే పంపుతున్నామన్నారు.
హైదరాబాద్‌తో పోలిస్తే విజయవాడ నుంచి 14 కోట్లు ఎక్కువ వ్యయం అయినా లెక్క చేయలేదన్నారు. ఇమామ్లకు 10 వేలు, పాస్టర్లకు 5 వేల చొప్పున నిధులు ఇస్తున్నామన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డును (Maulana Azad National Award) కడప జిల్లాకు చెందిన అబ్దుల్ సత్తార్‌కు, డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డును అన్నమయ్య జిల్లాకు చెందిన ఫకృద్దిన్కి, చిత్తూరు జిల్లాకు చెందిన పటాన్ మహ్మద్ ఖాన్‌కు లైఫ్ టైం అవార్డు సీఎం అందించారు.
పుట్టపర్తి సభలోనూ అబద్దాలతో వల్లెవేసిన సీఎం జగన్-కేంద్ర సాయాన్ని తమ ఖాతాలో వేసుకున్న ప్రభుత్వం