KEY POSTS IN YCP : వైసీపీలో పలు కీలక పదవులను భర్తీ చేస్తూ.. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు.. భార్గవ్‌రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు. వైసీపీ సోషల్ మీడియా సహా మీడియా కో-ఆర్డినేటర్‌గా సజ్జల భార్గవ్‌రెడ్డిని నియమించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడుగా కొరివి చైతన్య నియమితులయ్యారు. అలానే పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామిస్తూ... జగన్ ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీలో సజ్జల కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగింత - సజ్జల తనయుడు భార్గవ్‌రెడ్డికి కీలక బాధ్యత
SAJJALA BHARGAV REDDY : వైసీపీలో పలు కీలక పదవులను ముఖ్యమంత్రి జగన్ భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సజ్జల తనయుడు భార్గవ్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ సోషల్ మీడియా సహా మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
KEY POSTS IN YCP
వైసీపీలో పలు కీలక పదవులు..
- యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
- మహిళా విభాగం :పోతుల సునీత
- ఎమ్మెల్సీబీసీ సెల్: జంగా కృష్ణమూర్తి
- ఎస్టీ సెల్ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం), మేరాజోత్ హనుమంత్ నాయక్(మైదానం ప్రాంతం)
- రైతు విభాగం : ఎంవీఎస్ నాగిరెడ్డి
- విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య
- చేనేత విభాగం : గంజి చిరంజీవి
- వైయస్‌ఆర్ టీయూసీ: డాక్టర్ పూసూరు గౌతమ్‌రెడ్డి
- వికలాంగుల విభాగం: బందెల కిరణ్ రాజు
- సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష
- ప్రచార విభాగం: ఆర్. ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి
- గ్రీవెన్స్ సెల్: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి
- న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి
- ఐటీ విభాగం: సునీల్ పోసింరెడ్డి
- ఎన్‌ఆర్‌ఐ విభాగం: మేడపాటి వెంకట్
- వైయస్‌ఆర్ టీఎఫ్: కల్పలతా రెడ్డి,
- ఎమ్మెల్సీఎస్సీ సెల్ : జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్(ఎంపీ), కైలే అనిల్‌కుమార్, మొండితోక అరుణ్
- మైనారిటీ సెల్: షేక్ వి. ఖాదర్‌బాషా
- వైయస్‌ఆర్ సేవాదళ్: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
- క్రిష్టియన్ మైనారిటీ సెల్: జాన్సన్ మేడిది
- వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్
ఇవీ చదవండి:
Last Updated : Jan 5, 2023, 2:29 PM IST