ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2022, 6:12 PM IST

ETV Bharat / state

ఎట్టకేలకు ఆరుద్ర ఘటనపై స్పందించిన సీఎంవో.. వివరాల సేకరణ

CM CAMP OFFICE : కూతురు కోసం తల్లడిల్లిన ఆ తల్లిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఎట్టకేలకు దయ కలిగింది. ఆరుద్ర స్థితిగతులు, కుమార్తె అస్వస్థతపై సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు.. పలువురు అధికారులు ఆరుద్రను పరామర్శి.. తగిన వివరాలు రాబట్టారు.

CM CAMP OFFICE REACTS ON ARUDRA ISSUE
CM CAMP OFFICE REACTS ON ARUDRA ISSUE

CM CAMP OFFICE REACTS ON ARUDRA ISSUE : ఆరుద్ర ఆవేదనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్టకేలకు స్పందించింది. ఆరుద్ర స్థితిగతులు, కుమార్తె అస్వస్థతపై సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఆ మేరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను ముఖ్యమంత్రి కార్యదర్శి హరికృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా పరామర్శించారు. అందులో భాగంగానే సుమారు గంటకు పైగా సీఎం కార్యదర్శి హరికృష్ణ, కలెక్టర్‌, సీపీలు ఆరుద్రను ప్రశ్నించిన పూర్తి వివరాలు రాబట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించబోతున్నారు..? ఏయే వివరాలు తెలుసుకున్నారనే విషయాలను మీడియా ఎదుట బయటపెట్టేందుకు అధికారులు విముఖత చూపారు.

తన కుమార్తెకు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రిని కలిసేందుకు తాడేపల్లి వచ్చినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ఆరుద్ర నిరాశ చెందింది. తన గోడు వెల్లబోసుకోవాలని యత్నించిన ఫలితం లేకపోవడంతో నిన్న సీఎం కార్యాలయ సమీపంలో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆరుద్ర కుమార్తె అస్వస్థతపై ఈటీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. మంత్రి గన్​మెన్‌ వల్లే తన కుటుంబం కష్టాల పాలైందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర స్థితిగతులు, కుమార్తె అస్వస్థతపై సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details