ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముప్పాళ్ల మండలంలో వస్త్ర వ్యాపారి టోకరా..! - guntur district latest news

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వస్త్ర వ్యాపారి అప్పిచ్చిన వారిని మోసం చేశాడని తమకు న్యాయం చేయాలంటూ... ముప్పాళ్ల పోలీస్​స్టేషన్ ఎదుట కొందరు వ్యక్తులు ఆందోళనకు దిగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

clothes business man fraud in muppalla
ముప్పాళ్ల మండలంలో వస్త్ర వ్యాపారి టోకరా..!

By

Published : Oct 3, 2020, 5:00 PM IST

గుంటూరు జిల్లా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి సీతారామయ్య అనే వస్త్ర వ్యాపారి తమను నమ్మించి అధిక మొత్తంలో సుమారు 7 కోట్ల 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థులు సీతారామయ్యను అప్పు తీర్చమని కోరితే.. వైద్యపరికరాల వ్యాపారం చేసే పుల్లా సాహెబ్​కు డబ్బిచ్చానని.. అతను పారిపోయాడని తమను మోసం చేసి డ్రామా ఆడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని, పోలీసులు తమ డబ్బు తిరిగి ఇప్పించాలని కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఠాణా ఎదుట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details