ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విస్తృతంగా మట్టి గణనాథుల పంపిణీ - గుంటూరు

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన మెదలైంది... సేవా సంస్థలు, ట్రస్టులు, రోటరీ క్లబ్​లు ఇలా ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు ..మట్టి వినాయకుడుని పూజిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళుతున్నారు.

విసృతంగా పంపిణీ అవుతున్న మట్టి గణనాథులు

By

Published : Sep 2, 2019, 4:34 PM IST

విస్తృతంగా మట్టి గణనాథుల పంపిణీ

నెల్లూరు జిల్లా గూడూరులో వినాయకచవితి సందర్భంగా సాయి సత్సంగ నిలయం, ఆశ్రయ ఫౌండేషన్, పవన్ కళ్యాణ్ యువత ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పెరుగుతున్న కాలుష్యం వల్ల భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకే ఇప్పటినుంచే పర్యవరణాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని సత్సంగ నిలయం సభ్యులు పిలునిచ్చారు. ప్రకాశం జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి వినాయకుని ప్రతిమలను పట్టణ ప్రజలకు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మట్టి గణపతులతో పాటు మొక్కలు, గుడ్డ సంచులు లక్ష్మీ గ్రాఫిక్స్ యాజమాన్యం పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నవోదయ బోర్డు మెంబర్ గురు ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details