ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఆరుగురికి గాయాలు - గుంటూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో జరిగింది. పాత కక్షలే కారణమని గ్రామస్తులు పేర్కొన్నారు.

Clashes broke out between two groups in Pamidipadu village in Narasaraopet zone of Guntur district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఆరుగురికి గాయాలు

By

Published : Mar 13, 2021, 7:19 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పాత కక్షలతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. బాధితులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details