ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూళిపాళ్లలో ఇరు వర్గాల ఘర్షణ.. ఐదుగురికి తీవ్రగాయాలు - ధూళిపాళ్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వార్తలు

పాతకక్షలు, భూ వివాదం విషయంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవటంతో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

clashes between two groups
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఐదుగురికి తీవ్రగాయాలు

By

Published : Oct 9, 2020, 2:03 PM IST

గుంటూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పాతకక్షలు, భూ వివాదమే ఈ గొడవకు కారణమని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details