ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరు వర్గాల ఘర్షణ..20 గుడిసెలు దగ్ధం - గుంటూరులో ఇరు వర్గాల ఘర్షణ

ఓ స్థలం విషయమై గుంటూరు జిల్లా నకరికల్లు మండలం బాలాజీ నగర్ తండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదంలో ఒక వర్గానికి చెందిన గుడిసెలను మరోవర్గం వ్యక్తులు తగలబెట్టారు. ఘటనలో సుమారు 20కి పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు తెలిపారు.

ఇరు వర్గాల ఘర్షణ..ఇరవై గుడిసెలు దగ్ధం
ఇరు వర్గాల ఘర్షణ..ఇరవై గుడిసెలు దగ్ధం

By

Published : Mar 6, 2021, 9:04 PM IST

ఇరు వర్గాల ఘర్షణ..ఇరవై గుడిసెలు దగ్ధం

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం బాలాజీ నగర్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ స్థలం కారణంగా ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వివాదంలో ఒక వర్గానికి చెందిన గుడిసెలను మరోవర్గం వ్యక్తులు తగులబెట్టారు. ఘటనలో సుమారు 20కిపైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న నకరికల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకరికల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details