గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో.. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన మల్లి, నాగూర్ వలి, నయీమ్ మద్యం సేవించేందుకు నులకపేటకు చేరుకున్నారు. మద్యం కొనుగోలు, నగదు వ్యవహారంలో.. ముగ్గురి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో నయీమ్.. మల్లిపై మద్యం(బీరు) సీసాతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరిద్దరి మధ్య ఘర్షణ రేగడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకుని.. ఘటనలో గాయపడిన మల్లిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Clash: మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ.. బీరు సీసాతో దాడి - conflict between youngsters and one injured at tadepalli in guntur
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో.. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. మద్యం కొనుగోలు, నగదు వ్యవహారంలో.. మల్లి, నాగూర్ వలి, నయీమ్ అనే వ్యక్తుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో నయీమ్.. మల్లిపై బీరు బాటిల్తో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకుని మల్లిని ఆసుపత్రికి తరలించి.. మరో ఇద్దరిని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.

మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ.. బీరు సీసాతో దాడి