Clash between YCP leaders over mud quarry: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలో మట్టి క్వారీ విషయంలోవైసీపీ నేతల మధ్యజరిగిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే నీరుకొండలోని బీసీ కాలనీకి ఇటీవలే సిమెంట్ రోడ్డు నిర్మించారు. రోడ్డుకి ఇరువైపులా లెవెలింగ్ కోసం గ్రావెల్ తోలుకునేందుకు స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో నీరుకొండ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. ట్రాక్టర్ల సీరియల్ నెంబర్ కోసం తోట వెంకటేశ్వరరావు, తాడిపోయిన సాంబశివరావు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామ పెద్దలు ఆ ఇద్దరితో మంగళవారం రాత్రి చర్చలు జరిపారు. మరోసారి ఘర్షణకు రాకుండా ఇద్దరు మధ్య ఒప్పందం చేసి పంపించారు.
రాత్రి 12 గంటల సమయంలో తోట వెంకటేశ్వరరావు మరో నలుగురు అన్నదమ్ములతో కలిసి తాడిబోయిన సాంబశివరావు ఇంటిపైకి దాడికి దిగారు. దీంతోఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సుమారు 9 మంది గాయపడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. గ్రామంలో అలజడి జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలే ఘర్షణకు దారి తీశాయని పోలీసులు చెబుతున్నారు.
మంత్రి అప్పలరాజు రాజీనామా చేయాలి..శ్రీకాకుళంలో మత్స్యకారులు శాంతియుతంగా చేస్తున్న రీలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు.. కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్కు వద్ద.. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మత్స్యకార సంఘం ప్రతినిధులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు.. మంత్రి సీదిరి అప్పలరాజు కక్షపూరితంగా వ్యవహరించారని, జాతిని అవమానపరిచే విధంగా చర్యలకు పాల్పడ్డారని మత్స్యకారుల సంఘాల ఆధ్వర్యంలో.. ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. అయితే వీరు రిలే నిరాహార దీక్షలు చేయకుండా పోలీసులు అడ్డుకుని.. అరెస్టు చేయడంపై మండిపడ్డారు. వెంటనే మంత్రి రాజీనామా చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
జాతిని అవమానించారని మత్స్యకారులు నిరాహార దీక్ష మత్స్యకారులందరూ శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తుంటే పోలీసులు అక్రమంగా, అన్యాయంగా ఈ రోజు మమ్మల్ని అరెస్టు చేయడం జరిగింది.. మత్స్యకార మంత్రి అయిన సీదిరి అప్పలరాజు మా ఓట్లతో గెలిచి.. మంత్రి పదవి పొంది.. ఈ రోజు మేము చేస్తున్న నిరాహార దీక్షలు ఆపించేయడానికి కారణం సీదిరి అప్పలరాజేనని తెలియజేస్తున్నాం. వెంటనే మంత్రి సీదిరి అప్పలరాజు రాజీనామా చేయాలని కోరుతున్నాం.- సూర్యనారాయణ, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు