ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చి వివాదం.. ఇరు వర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు

గుంటూరు వెస్ట్ పారిస్ చర్చి మోడరేట్​ బిషప్​ విషయమై జేసుదానం, రవికిరణ్​ అనే పాస్టర్ల మధ్య నెలకొన్న అధిపత్య పోరు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గం వ్యక్తులు జరిపిన దాడిలో ఆంధ్రా లూథరన్ ఇవాంజికల్ చర్చి సభ్యుడు జాన్ కృపాకర్​కు తీవ్రగాయాలయ్యాయి.

pastors
చర్చి

By

Published : Aug 3, 2021, 7:04 PM IST

గుంటూరులోని ఆంధ్రా లూథరన్ ఇవాంజికల్ చర్చి(ఏఎల్ఈసీ)ల నిర్వహణపై వివాదం పతాకస్థాయికి చేరింది. ఓ వర్గం జరిపిన దాడిలో ఏఎల్ఈసీ సభ్యుడు జాన్ కృపాకర్​కు తీవ్రగాయాలయ్యాయి. కర్రలు, రాడ్లతో ప్రత్యర్ధులు దాడి చేయడంతో కృపాకర్​కు గాయాలు కాగా.. వెంటనే జీజీహెచ్​కు తరలించారు.

గుంటూరు వెస్ట్ పారిస్ చర్చిలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చర్చిపై ఆధిపత్యం కోసం కొన్నిరోజులుగా జేసుదానం, రవికిరణ్ పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరు పాస్టర్లకు చర్చిలో ప్రార్థనలు చేసే విషయమై పోటీ నెలకొంది. గతంలో గుంటూరులోని పలు ఏఎల్ఈసీ చర్చిల్లో పరదేశీ బాబు, ఏలియా వర్గాల మధ్య ఆధిపత్యం పోరు నడిచింది.

చర్చి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ-ఒకరికి తీవ్ర గాయాలు

కృపాకర్​పై దాడిని పరదేశిబాబు ఖండించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఏఎల్ఈసీ మోడరేట్ బిషప్​గా మే 21న అధికారికంగా కార్యనిర్వహక సభ్యులు తనను ఎన్నుకున్నారని పరదేశీబాబు గుర్తు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మోడరేట్ బిషప్​గా ఉండటానికి 45-65 ఏళ్ల మధ్య వయసు ఉండాలని.. 70 ఏళ్లు దాటిన ఏలియా బలవంతంగా చర్చిలోకి ప్రవేశిస్తున్నారని పరదేశి బాబు ఆరోపించారు.


ఇదీ చదవండి:ఈస్ట్ పారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య వివాదం.. చక్కదిద్దిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details