ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దొంగ సొమ్ము' కోసం తగవు.. సహచరుడి గొంతు కోసిన దొంగలు! - tenali crime news update

వారంతా కలిసి దొంగతనాలు చేస్తుంటారు. చోరీ చేసిన నగదును పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దొంగలించిన నగల పంపకాల్లో తేడా వచ్చింది. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన తోటి దొంగలు.. సహచరుడిపై దాడికి దిగారు. గొంతు కోసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

'దొంగ సొమ్ము' కోసం తగవు
'దొంగ సొమ్ము' కోసం తగవు

By

Published : Feb 3, 2021, 9:16 AM IST

చోరీ సొత్తు పంపకాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తిన కారణంగా... సహచరులే యువకుడి గొంతు కోశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గోదాముల వద్ద జరిగింది. దగ్గుబాటి రాజశేఖర్, శ్రీను అనే యువకులిద్దరూ కలిసి దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ చోట చోరీ చేసిన బంగారు గొలుసు పంపకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. రాజశేఖర్ మరో ఇద్దరు యువకులతో కలిసి కత్తితో శ్రీను గొంతు కోశాడు.

తీవ్రంగా గాయపడిన శ్రీనుని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అతడిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరు ఎక్కువగా దారిదోపిడీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. రాజశేఖర్, శ్రీను పాత నేరస్థులేనని.. చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని వివరించారు. శ్రీను తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందినవ్యక్తిగా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details