గుంటూరు పౌరసరఫరాల గోదాంకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తమ చేతివాటం చూపించారు. గోదాం నుంచి పీడీఎస్ బియ్యాన్ని నేరుగా రైసు మిల్లులకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సుమారు 12 లక్షల విలువైన 820 రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఒక లారీని పోలీసులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి తరలించగా... మరో లారీ వట్టిచెరుకూరు మండలంలోని వెంకటేశ్వర్ రైస్ మిల్లుకు తరలించినట్లు గుర్తించారు. రైస్ మిల్లు వద్దకు చేరుకున్న పోలీసులు మిల్లును సీజ్ చేసి, గుంటూరు తరలించారు. కేసు నమోదు చేసిన పాత గుంటూరు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పౌరసరఫరాల గోదాం నుంచి నేరుగా రైస్ మిల్లులకే బియ్యం - Civil Supplies employees arrested latest news update
గోదాం నుంచి పీడీఎస్ బియ్యాన్ని నేరుగా రైసు మిల్లులకు తరలిస్తున్న ఇద్దరు పౌరసరఫరాల గోదాం ఉద్యోగులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షల విలువైన 820 రేషన్ బియ్యం బస్తాలతో ఉన్న రెండు లారీలు స్వాధీనం చేసుకున్నారు.
![పౌరసరఫరాల గోదాం నుంచి నేరుగా రైస్ మిల్లులకే బియ్యం Civil Supplies employees arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8842229-114-8842229-1600395576147.jpg)
నేరుగా రైసు మిల్లులకే బియ్యం తరలింపు