ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెలాఖరు లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ: గుంటూరు నగర కమిషనర్ - గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ తాజా సమాచారం

ఆస్తి పన్నును ఈ నెలాఖరు లోపు చెల్లించిన వారు 5 శాతం రాయితీ పొందవచ్చునని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను.. చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.

guntur Commissioner Challa Anuradha
గుంటూరు నగర కమీషనర్ చల్లా అనురాధ

By

Published : Apr 15, 2021, 8:11 AM IST

గుంటూరు నగరపాలక సంస్థ 2020-21 ఆర్ధిక సంవత్సరం ఆస్తి పన్నును.. ఈ నెలాఖరు లోపు చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. పన్ను చెల్లింపు డిమాండ్ నోటీసులు బకాయిదార్లకు అందించే ప్రక్రియ చేపట్టామన్నారు. చెల్లింపుదారులు డిమాండ్ నోటీసు కోసం వేచి ఉండకుండా అసెస్మెంట్ నెంబర్, పాత పన్ను చెల్లింపు రశీదుతో కూడా చెల్లించవచ్చన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయం, నిర్దేశించిన సచివాలయాల్లో క్యాష్ కౌంటర్లు గురువారం నుంచి పనిచేస్తాయన్నారు. నగర పాలక సంస్థకు చెల్లించవలసిన బకాయిలను ముందస్తుగా చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని తెలియచేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details