కరోనాతో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరసన చేపట్టారు. లాక్‌డౌన్ వేళ ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కుటుంబానికి రూ.5వేలు చెల్లించాలని, ఇప్పటివరకు ఉన్న 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుందని... ఇటువంటి ఆలోచనలను విరమించుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని దినాలను పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, నగర కార్యదర్శి ముత్యాలరావు తదితరులు డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆందోళన
గుంటూరులో సీఐటీయూ నాయకులు సామాజిక దూరాన్ని పాటిస్తూ నిరసన చేపట్టారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు.
సామాజిక దూరంతో..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్