ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు ?'.. తెలుగుయువత నాయకుడిని విచారించిన సీఐడీ - తెలుగుయువత నాయకుడిని విచారించిన సీఐడీ

CID Enquiry: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టాడనే ఆరోపణలతో తెలుగు యువత సోషల్‌ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ చీరాల సునీల్‌ను బుధవారం గుంటూరు సీఐడీ పోలీసులు విచారించారు. అనంతరం తాము పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని వ్యక్తిగత పూచీకత్తుపై 41 నోటీసు ఇచ్చి పంపించారు.

ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు
ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు

By

Published : Aug 4, 2022, 10:08 AM IST

Social Media posts: తెలుగు యువత సోషల్‌ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ చీరాల సునీల్‌ను బుధవారం గుంటూరు సీఐడీ పోలీసులు విచారించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టాడంటూ, అందుకు విచారణకు హాజరవ్వాలని సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేసిన క్రమంలో బుధవారం సునీల్‌ గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు విచారించారు. అనంతరం తాము పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని వ్యక్తిగత పూచీకత్తుపై 41 నోటీసు ఇచ్చి పంపించారు.

విచారణలో తనను ఆ పోస్టు ఎవరు పెట్టమన్నారు ? ఆదాయం ఎమైనా వస్తుందా ? అని అడిగారని విలేకరులతో మాట్లాడుతూ సునీల్‌ తెలిపారు. తనను ఎవరూ పెట్టమనలేదని, తనకు వచ్చిన పోస్టుపెట్టి వెంటనే తీసివేసినట్లు సమాధానమిచ్చానని చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి గుంటూరు వచ్చిన చీరాల సునీల్‌కు తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, అధికార ప్రతినిధి షుకూర్‌ తదితరులు అండగా నిలచి సీఐడీ కార్యాలయానికి తీసుకు వెళ్లి తీసుకువచ్చారు.

ఇవీ చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details