న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన వ్యక్తిపై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దరిశ కిశోర్‌రెడ్డిపై ఐటీ చట్టం 67 సెక్షన్, ఐపీసీ 153(ఏ), 505(2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై సాక్ష్యాధారాలతో సహా సీల్డ్ కవర్‌లో సీఐడీకి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పంపారు. వెంటనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వ్యక్తిపై కేసు నమోదు - ఏపీలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు.
CID police have registered a case against a man who posts on social media against judges