ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు సీఐడీ నోటీసులు - అమరావతి తాజా వార్తలు

రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వాళ్లకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న రైతులంతా 15రోజుల్లో సమాధానం ఇవ్వాలని సీఐడీ పేర్కొంది.

CID notices to purchased lands from assigned farmers
సీఐడీ నోటీసులు

By

Published : Aug 3, 2021, 4:21 AM IST

అమరావతిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. భూసమీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వాటిని రాజధానికి ఇచ్చి ప్లాట్లు పొందిన వారందరికీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం భూములు విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41ను విడుదల చేసింది. దీని ప్రకారం అసైన్డ్ భూములు కొని ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని సీఐడీ నిర్ణయించింది. గత 2రోజులుగా దాదాపు 50మందికి నోటీసులు అందినట్లు సమాచారం. మిగిలిన వారికి కూడా వారం రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెం 41ను రద్దు చేస్తూ.. జీవో నంబర్ 316ను విడుదల చేసింది. దీని ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధమని పేర్కొంది. నోటీసులు అందుకున్న రైతులంతా 15రోజుల్లో సమాధానం ఇవ్వాలని సీఐడీ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details