CID DIG: సీఐడీ ఏడీజీ ఆదేశాల మేరకు అయ్యన్నపాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులు విజయ్, రాజేష్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు పంపినట్లు వెల్లడించారు. అయ్యన్న, ఆయన కుమారులు ఎన్వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఇరిగేషన్ ఈఈ కె. మల్లిఖార్జునరావు సీఐడీ ఏడీజికి ఫిర్యాదు చేసినట్లు ఆ కాపీని ఎఫ్‌ఐఆర్‌కు జతచేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి ఏ-1గా అయ్యన్నపాత్రుడు, ఏ-2గా చింతకాయల విజయ్, ఏ-3గా రాజేష్‌తోపాటు మరికొందరిపైన ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
"అయ్యన్నపాత్రుడి అరెస్టు విషయంలో అన్ని నిబంధనలు పాటించాం. ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగాలపై కేసు నమోదు. ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఏ-1 అయ్యన్న, ఏ-2 విజయ్, ఏ-3గా రాజేష్‌పై కేసు నమోదు. నకిలీ ఎన్‌వోసీ తీసుకురావడం మామూలు విషయం కాదు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి ఆక్రమించారు." -సునీల్‌కుమార్ నాయక్, సీఐడీ డీఐజీ