విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో విశాఖ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు పరిహారం అందచేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్ పెట్టారంటూ గుంటూరులో రంగనాయకమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ నెల 21 సీఐడీ ఎదుట హాజరుకావాలని నోటీసులిచ్చారు.
విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి నోటీసులు - cid cases on old women in guntur
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్ లో పోస్టు పెట్టారంటూ గుంటూరులో పూతోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలికి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసత్య ప్రచారంతో... ప్రజల్లో భయాందోళనలు రెచ్చగొట్టే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్న అభియోగంపై సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ నోటీసు జారీ చేశారు.
గుంటూరులోని లక్ష్మీపురం ప్రాంతంలో నివాసం ఉండే పూతోట రంగనాయకమ్మను కలిసిన సీఐడీ సీఐ దిలీప్‌కుమార్.. ఈ మేరకు నోటీసు అందించారు. విషవాయువు ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై విచారణ చేపట్టారు. వాటిని రంగనాయకమ్మ పోస్టు చేసినట్టు గుర్తించామని .. ఆమెకు సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ ప్రకారం సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టడానికి రంగనాయకమ్మకు సహకరించిన మల్లాది రఘునాథ్ పై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి