ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలువురు రెవెన్యూ ఉద్యోగులకు సీఐడీ పిలుపు - CID call for several Revenue employees news

రాష్ట్ర రాజధాని అమరావతిలోని అసైన్డ్‌ భూముల విషయంలో పలువురు రెవెన్యూ ఉద్యోగులను సీఐడీ విచారించనున్నట్లు సమాచారం.

cid investigation
సీఐడీ విచారణ

By

Published : Apr 6, 2021, 10:16 AM IST

రెవెన్యూ శాఖలోని పలువురు ఉద్యోగులకు సీఐడీ విచారణకు హాజరు కావాలని పిలుపు అందినట్లు సమాచారం. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల విషయంలో గుంటూరు జిల్లాలో పని చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులను విచారించనున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో జేసీగా శ్రీధర్‌ ఉన్నప్పుడు పనిచేసిన పలువురిని విచారణకు పిలిచినట్లు తెలిసింది. ఆయా ఉద్యోగుల్లో కొందరు గుంటూరు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో పని చేస్తుండగా... వారిని ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మరో స్థానానికి ఇప్పటికే బదిలీ చేశారని, మరికొందరిని ఒకట్రెండు రోజుల్లో బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details