ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు చదువంటే ఆసక్తి లేదు.. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయాం' - తెనాలి పదో తరగతి విద్యార్థుల అదృశ్యం

మానసిక ఒత్తిడికి తట్టకోలేక పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని వెతికి పట్టుకున్నారు. కుటుంబీకులకు అప్పగించారు.

boys missing
ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ

By

Published : Mar 18, 2021, 6:43 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానమ్మ పేటలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అదృశ్యమవగా.. టూ టౌన్ పోలీసులు వారిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గత మంగళవారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవగా.. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆ ముగ్గురినీ గంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా... తమకు చదువుపై ఆసక్తి లేదనీ, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని చెప్పినట్లు సీఐ తెలిపారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకే ఇల్లు విడిచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details