ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాస్టర్​పై దాడి కేసు... ఆధారాలిచ్చినా చర్యలేవి..?'

గుంటూరు జిల్లా పెనుమాకలో పాస్టర్ జయకిషోర్​పై దాడి ఘటనలో చర్యలు లేవంటూ... క్రైస్తవులు ధర్నా చేపట్టారు. పెనుమాకలో రాస్తారోకో నిర్వహించి.. పోలీసులు ఎందుకు నిందితులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

christiand blocked road in penumaka in guntur district
పాస్టర్​పై దాడి కేసులో చర్యలు కోరుతూ క్రైస్తవుల ధర్నా, రాస్తారోకో

By

Published : Jan 31, 2021, 7:11 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చర్చి పాస్టర్​పై అధికార పార్టీ నేతల దాడిని నిరసిస్తూ... క్రైస్తవులు ధర్నాకు దిగారు. పాస్టర్ కిషోర్​పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ... పెనుమాకలో రాస్తారోకో నిర్వహించారు. దాడి జరిగి 20 రోజులు దాటుతున్నా.. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని క్రైస్తవులు ప్రశ్నించారు. వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నాకు అనుమతి లేదని చెప్పిన పోలీసులపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా నేతలే దాడికి పాల్పడినట్లు వీడియో ఆధారాలు ఇచ్చినా.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగాయని క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఇమ్మానుయేలు ఆరోపించారు. జనవరి 7న ఏలూరు నుంచి వస్తుండగా తన ఇంటి సమీపంలో కొంతమంది అధికార పార్టీ నేతలు కావాలనే ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఘర్షణకు దిగారని పాస్టర్ జయకిషోర్ తెలిపారు. వైకాపా నేతల దాడిలో తాను 49 శాతం వినికిడి శక్తిని కోల్పోయానని జయకిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details