ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.7కోట్లు టోకరా - ap latest news

fraud: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో చిట్టీల పేరిట మోసం జరిగింది. రూ.7 కోట్లు వసూలు చేసి.. ఓ కుటుంబం గ్రామం నుంచి పరారైనట్లు ఆరోపిస్తూ స్థానికులు.. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

fraud
ఫిరంగిపురంలో చిట్టీల పేరుతో మోసం

By

Published : Dec 4, 2021, 9:49 AM IST

fraud in phirangipuram: చిట్టీల పేరుతో ఓ కుటుంబం రూ.7 కోట్లు టోకరా పెట్టి పరారైనట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో జరిగింది.

నిడమనూరి భీమేశ్వరావు, సుబ్బాయమ్మ దంపతులు పొనుగుపాడులో చిల్లర, వస్త్ర, మెడికల్‌ దుకాణం నడుపుతున్నారు. కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. గ్రామస్థులు కొందరు రూ.3 కోట్లు దాకా వారి వద్ద చిట్టీలు కట్టారు. వీరితో పాటు గ్రామం చుట్టుపక్కల ఉన్న నరసరావుపేట, గుంటూరు నగరానికి చెందిన కొందరు రూ.4 కోట్ల వరకు చిట్టీలకు సొమ్ము చెల్లించారు. అయితే.. భీమేశ్వరావు కుటుంభసభ్యులు రెండ్రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బయటకు వెళుతున్న సమయంలో.. స్థానికులు ప్రశ్నించారు. దీంతో వారు విహారయాత్రకు వెళుతున్నట్లు తెలిపారని స్థానికులు పోలీసులకు వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగానే వారు గ్రామం నుంచి వెళ్లిపోయారని ఆరోపిస్తూ.. బాధితులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై అజయ్‌బాబు తన సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామానికి వెళ్లి విచారించారు. ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్ము.. చిట్టీల పేరుతో భీమేశ్వరావు కుటుంబానికి కట్టామని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని గ్రామస్థులు లబోదిబోమంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details