ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌తో సినీనటుడు చిరంజీవి దంపతుల భేటీ అయ్యారు. తన సతీమణి సురేఖతో కలసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ పటమటలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం 1. 50 తాడేపల్లి లోని సీఎం నివాసానికి చిరంజీవి దంపతులు వెళ్లారు. సచివాలయం నుంచి ఇంటికి చేరుకున్న జగన్. .. చిరును ఆప్యాయంగా పలుకరించారు. సీఎంను చిరంజీవి శాలువాతో సన్మానించారు. చిరు దంపతులను సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం అందరూ కలసి భోజనం చేశారు. తాను నటించిన సైరా సినిమా విశేషాలను సీఎం జగన్‌కు చిరంజీవి వివరించారు. సైరా సినిమాను వీక్షించాలని జగన్ దంపతులను చిరంజీవి కోరారు. సైరా సినిమా విజయవంతం అయినందుకు చిరంజీవికి సీఎం అభినందనలు తెలిపారు. సైరా సినిమాను తాను తప్పక చూస్తానని చెప్పినట్లు తెలిసింది. తాడేపల్లి లోని సీఎం నివాసంలో గంటపాటు ఉన్న చిరు దంపతులకు వెళ్లేముందు సాంప్రదాయబద్దంగా మర్యాదలు చేసి సాదరంగా వీడ్కోలు పలికి సాగనంపారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి దంపతుల భేటీ - సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీ
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి దంపతులతో చిరంజీవి దంపతులు భోజనం చేశారు.
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి దంపతుల భేటీ
ఇదీ చదవండి
Last Updated : Oct 14, 2019, 11:19 PM IST