సినీనటుడు చిరంజీవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ గుంటూరులో చిరంజీవి అభిమానులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిన చిరంజీవిపై నారాయణ విచక్షణ మర్చిపోయి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నారాయణపై చిరంజీవి యువత సభ్యులు నరసరావుపేటలో ఫిర్యాదు చేశారు. చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నేత నారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: చిరంజీవి అభిమానులు - సీపీఐ నారాయణ న్యూస్
సినీనటుడు చిరంజీవిపై సీపీఐ కార్యదర్శి నారాయణ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ గుంటూరులో చిరంజీవి అభిమానులు పోలీసులను ఆశ్రయించారు. చట్టపరంగా నారాయణపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
చిరంజీవి అభిమానులు