ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన బలోపేతానికి చిరంజీవి అభిమానులు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

చిరంజీవి అభిమానులంతా జనసేన బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో సమావేశమైన చిరంజీవి అభిమాన అనుబంధ సంఘాల నేతలు కీలక సమావేశం నిర్వహించారు.

మంగళగిరిలో చిరంజీవి అభిమాన అనుబంధ సంఘాల నేతల భేటీ
మంగళగిరిలో చిరంజీవి అభిమాన అనుబంధ సంఘాల నేతల భేటీ

By

Published : Sep 18, 2021, 4:53 PM IST

చిరంజీవి అభిమానులంతా జనసేన బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో సమావేశమైన చిరంజీవి అభిమాన అనుబంధ సంఘాల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. సంఘానికి నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా చింతామణి మహేష్, రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా భవాని రవికుమార్ ను ఎన్నుకున్నారు.

చిరంజీవి పిలుపుతో ఆక్సిజన్ బ్యాంకుకు సహాయం చేసిన వారిని ఘనంగా సత్కరించారు. రాబోయే మెగా హీరోల సినిమాలకు సామాజిక మాద్యమాల ద్వారా చిరంజీవి అభిమాన సంఘాలు విస్తృత ప్రచారం చేయాలని సమావేశంలో తీర్మానించారు. తామంతా ప్రజారాజ్యం బలోపేతానికి కృషి చేశామని..అది అనుకోకుండా ఇతర పార్టీలో కలిసిపోయిందన్నారు. వచ్చే ఎన్నికలలో చిరంజీవి అభిమానులకు జనసేనలో పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు ప్రకటించారు.

ఇదీ చదవండి:

ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details